సూపర్ జి.ఎస్.టి సూపర్ సేవింగ్స్ 2.0 పై మోటార్ వెహికల్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
సూపర్ జి.ఎస్.టి సూపర్ సేవింగ్స్ 2.0 పై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి.విజయకుమారి ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి.విజయ్ కుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎంవిఐ కార్యాలయం నుండి ప్రారంభమై కోటపల్లి క్రాస్ రోడ్ వరకు కొనసాగింది.ర్యాలీలో పాల్గొన్న వారి పేర్లు గల చీటీలను లక్కీ డ్రా తీసి గెలుపొందిన వారికి హెల్మెట్లను బహుకరించారు.ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి.విజయ్ కుమారి, జిఎస్.టి అధికారి శివయ్య మాట్లాడుతూ అధికారులు ప్రజలకు జి.ఎస్.టి 2.0 సంస్కరణల ప్రయోజనాలు, పన్ను సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు