మేడ్చల్: మల్లాపూర్ లో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మర్రిగూడ కాలనీలో 14 లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ పైప్లైన్ సమస్య పరిష్కారం కొరకు మరియు ఎన్నో సి నుండి వస్తున్న కలుషిత విద్య జలాలు పరిష్కారం కొరకు తగిన చొరవ చూపాలని ఎమ్మెల్యేని కాలనీవాసులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధించిన రైల్వే మరియు ఎన్ఎఫ్సీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.