ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ కు బిఆర్ఎస్ ములుగు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేష్ నేడు శనివారం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు ఫిర్యాదు అందజేశారు. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పార్టీ మీటింగ్లలో, అలాగే సోషల్ మీడియా గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేస్తున్నారని, ఆధారాలతో సహా నేడు బిఆర్ఎస్ ములుగు జిల్లా యూత్ అధ్యక్షుడు కోకిల మహేష్ ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ కు కలిసి ఫిర్యాదు అందజేశార