బోయపాలెం గ్రామంలో ఓ వ్యక్తి మృతి హత్య కేసు నమోదు
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఆదివారం మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ వ్యక్తి మృతికి దారితీసింది. వేల్పురి శ్రీనాథ్ పై పొట్లూరు విష్ణు, మల్లవరపు చందు, మణికంఠ, రావూరి విజయ్, దాడి చేశారని మృతుడి అన్న ఆరోపించారు. దీంతో చాతిలో నొప్పి వచ్చి అపస్మార స్థితిలోకి వెళ్లిన శ్రీనాధుని ఆసుపత్రి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనాథ్ అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.