గద్వాల్: మల్లెం దొడ్డి గ్రామంలో భర్తపై ఉడుకుతున్న ఆయిల్ పోసిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన భర్త
మల్దకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన పద్మ ఈ నెల 11 తేదీన తన భర్త పై కాలుతున్న ఆయిల్ పోయడంతో భార్యకు మరియు భర్తకు ఉన్న తగాదాల వల్ల ఈ పని చేసుంటుందని వాపోతున్నారు. పద్మ భర్త ఆయన ముల్లుంటి వెంకటేష్ 11వ తేదీ నాడు మెరుగైన చికిత్స కొరకు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. చికిత్స పొందుతూ నేడు సోమవారం సాయంత్రం మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.