మెదక్: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం
Medak, Medak | Sep 21, 2025 పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం పంచాయతీ కార్యదర్శి వేధింపులు తాళలేక పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కొమ్మాట ఇందిర గత మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా కార్యదర్శి నర్సింలు వేధిస్తున్నారని ఆరోపించారు. మనస్తాపం చెందిన కొమ్మాట ఇందిర శనివారం మధ్యాహ్నం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.