జమ్మలమడుగు: యర్రగుంట్ల : ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత..
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీపీలో జల విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. గురువారం తెల్సిన వివరాల మేరకు ఆర్టీపీపీ లోని ఆరు యూనిట్లలో 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది.ప్రస్తుతం నాల్గవ యూనిట్లో 210 మెగావాట్లకు గాను 140 మెగావాట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.జెన్కో యాజమాన్యం ఆదేశాల మేరకు ఉత్పత్తి నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.