నరసన్నపేట: కల్వర్టుపై రక్షణ గోడ నిర్మించండి
నరసన్నపేట మేజర్ పంచాయతీలో స్థానిక పెద్దపీట వీధి వద్ద ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం రహదారిపై రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇక్కడ కల్వర్టు నిర్మాణాన్ని రహదారితో పాటు నిర్మించారు. అయితే రక్షణ కూడా లేకపోవడంతో పలు వాహన చోదుకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు కలుగజేసుకొని తక్షణమే రక్షణ కూడా నిర్మించాలంటూ స్థానికులు కోరుతున్నారు.