కరీంనగర్: విద్యార్థులు కళల్లోనూ రాణించాలి : జిల్లా స్థాయి "కళోత్సవ్" పోటీల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళలు, క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి "కళోత్సవ్" పోటీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12 కేటగిరీలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా స్థాయి పోటీలను బుధవారం సాయంత్రం 5గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు.