ప్రొద్దుటూరు: కర్నూల్ వద్ద బస్సు ప్రమాదంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రయాణికులు మరణించారు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
Proddatur, YSR | Oct 26, 2025 ఈ నెల 24వ తేదీన కర్నూల్ వద్ద జరిగిన 20 మంది బస్సు ప్రయాణీకుల మరణాలకు ఆంధ్రప్రదేశ్ సీఎం.చంద్రబాబు ప్రధాన బాధ్యుడని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బస్సు ప్రమాదంలో ప్రయాణీకులు మరణించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మరణించారని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ముద్దాయిలుగా చేర్చాలన్నారు.