రాజానగరం: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు :జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరిక జారీ చేశారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో సమావేశం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి స్కానింగ్ సెంటర్లు ఆస్పత్రులపై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చారు.