శ్రీకాకుళం: బిల్లు కట్టమన్నందుకు జలంతర కోట జంక్షన్ వద్ద ఉన్న ధాబా వద్ద లారీ తో గుద్ది ఇద్దరిని హతమార్చిన లారీ డ్రైవర్
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జంక్షన్ సమీప జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దాబాలో బుధవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి విశాఖ వైపు వెళ్లే ఓ లారీ డ్రైవర్ ధాబాలో భోజనం చేసి డబ్బులు ఇచ్చే క్రమంలో... దాబా యజమాని మహమ్మద్ హయాబ్ తో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణను ఆపేందుకు అక్కడే ఉన్న దండాసి ప్రయత్నించగా... బాబా యజమానితో పాటు దండాసిని లారీ తో ఢీ కొట్టి పరారవుతుండగా... స్థానికులు లారీని వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో కేవలం 200 వందల కోసం ఇద్దరు వ్యక్తులను హతమార్చినట్లు గురువారం సాయంత్రం సంచలన విషయాలు బయటపడ్డాయి.