శివపురం లింగాపురం గ్రామాలమధ్య పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ డిమాండ్
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని శివపురం లింగాపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ప్రతి సంవత్సరం ఉధృతంగా ప్రవహించి 13 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ఈ వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి యేసు రత్నం డిమాండ్ చేశారు, మంగళవారం పెద్ద వాగు ఉధృతికి దెబ్బతిన్న లో లెవెల్ వంతెనను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం పెద్దవాగు ఉదృతంగా ప్రవహించి గిరిజన గూడెలతో కలిపి 13 గ్రామాల ప్రజల రాక