ఆదోని: ఆదోనిలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శ్రీనివాస బస్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి : సిపిఎం
Adoni, Kurnool | Oct 7, 2025 ఆదోనిలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శ్రీనివాస బస్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. పట్టణ కార్య దర్శి లక్ష్మన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేశ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ రాఘవేంద్రకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బస్సులు నిబంధనలకు విరుద్ధంగా సరుకులు తరలించడం, అధిక లోడుతో నడపడం ప్రజల ప్రాణాలకు ముప్పు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.