నారాయణపేట్: హమాలీ కూలీలకు సమగ్ర చట్టం తీసుకొని రావాలి: ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొండన్న
మరికల్ మండలంలో హమాలీ కూలీలకు సమగ్ర చట్టం చేసి వారి సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. గురువారం మరికల్ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కొండన్న మాట్లాడుతూ హమాలీ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కార్మికులుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.