రాయదుర్గం: పట్టణంలో పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన టిడిపి నేతలు
రాయదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్ట అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు ఆధ్వర్యంలో 32 వార్డుల ఇంచార్జలతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరల పురుషోత్తం, మహిళ అధ్యక్షురాలు బండిభారతి, కౌన్సిలర్ ప్రశాంతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేషులు, కడ్డీపూడి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.