కుప్పం: ఈనెల 17న జరిగే విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయండి : కుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యరాజ్
కుప్పం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో ఈనెల 17వ తేదీన జరగబోవు విశ్వకర్మ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ కోరారు. ఆదివారం కమ్యూనిటీ భవనం నందు విశ్వబ్రాహ్మణ కులస్తులు అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగిందని, ఈ ఎన్నికల్లో సత్యరాజ్ ను కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. అనంతరం నూతన ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముందుగా తనను నమ్మి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న కుల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.