జగిత్యాల: పట్టణంలో సోమవారం తీన్ కని చౌరస్తా లో రోడ్ క్రాసింగ్ కొత్త లైన్, అమర్చేడం ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేత
జగిత్యాల పట్టణంలో పలు వార్డులో తేది 15 సోమవారం ఉదయం 9 గంటల నుండి 11 గంల వరకు. విద్యుత్ సరఫరా నిలిపివేత... తీన్ కని చౌరస్తా ఏరియా లో రోడ్ క్రాసింగ్ కొత్త లైన్, ట్రాన్స్ఫార్మర్ అమర్చేడం ఉన్నందున టౌన్ 3 సెక్షన్ పరిధిలోని తీన్ కని చౌరస్తా, పెద్ద మసీదు, కటికే వాడ ,మంచి నీళ్ళ బావి, ఇస్లాం పుర, గాంధీనగర్, తెనుగువాడ, దగ్గులమ్మ గుడి, ఉస్మాన్ పుర, మహబూబ్, రహ్మత్ పుర, జెండా మహిళ, ప్యారా బాయ్, గోరేమియా, ఖిలా గడ్డ తులసి నగర్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపియబడు కావున వినియోగదారులు సహకరించ గలరని ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక ప్రకటనలో డిఇ.కె . గంగారం కోరారు.