ఆర్ఎస్ రంగాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్య
Dhone, Nandyal | Nov 12, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో మంగళవారం అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా(30)ను దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.