కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన అని శెట్టి వంశీపై కత్తితో దాడి చేసిన స్థానికుడైన జ్యోతుల రాంబాబ, బి. ప్రత్తిపాడుకు చెందిన ఊటా దుర్గాఉమర్ అలీషా అనే ఇంద్రలను అరెస్టు చేశామన్నారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వంశీని పొడిచిన కత్తిని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. గతేడాది డిసెంబరు 31న వంశీ, రాంబాబుల మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో తిరిగి ఈ ఘర్షణకు పాల్పడ్డారన్నారు. ఛత్తీస్గఢ్ లోని కుంట పోలీసుస్టేషన్లో రాంబాబు, దుర్గాఉమర్ అలీషాలపై గంజాయి రవాణా కేసు ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శనివారం సాయంకాలం 7 గంటలకు తెలిపారు.