ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ జండా ఊపి పొదుపు వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. వారం రోజులు పాటు జరిగాయి ఈ కార్యక్రమంలో ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలి? ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై విద్యుత్ అధికారులు కృషి చేస్తారని వారి సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు సూర్య ఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనం విద్యుత్తును తయారు చేసి మన అవసరాలకు వాడుకొని మిగిలినది పదిమందికి పని చేయు విధంగా ప్రజలు ఆలోచించాలని తెలియజేశారు