ఆటో కార్మికుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఎమ్మెల్సీ రూహుల్లా
ఆటో కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్సీ ఎండి. రుహుల్లా అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వైయస్సార్ ట్రేడ్ యూనియన్ కు చెందిన ఆటో కార్మికులు మర్యాదపూర్వకంగా రుహుల్లా ను కలిశారు. రుహుల్లా తమకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రుహుల్లా మాట్లాడుతూ.. అన్ని వర్గాల కార్మికులకు సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని, కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం అన్నారు.