జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి 7 గంటల సమయం లో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ జిల్లాలోని వివిధ పర్యాటక సంరక్షణ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పర్యాటక స్థలాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి తరంతోపాటు రానున్న భవిష్యత్ తరాలకు మన దేశ సాంస్కృతిక వారసత్వమును పురాతన నిర్మాణాలు, చారిత్రక ప్రాధాన్యత విషయాల గురించి తెలుపవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నరు.