ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజల స్వామివారి ఆలయం నందు ఈరోజు సాయంత్రం బాలాలయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టేసాయి,దేవస్థానం డిప్యూటీ ఈ.వో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, ఏ.ఈఓ హేమామాల్ని,సూపర్డెంట్ రవి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.