నాగాలాపురం: ఇప్పటికీ చెట్ల కిందే ట్రీట్మెంట్.! నాగలాపురం పంచాయతీ వినోబా నగర్ YSR విలేజ్ హెల్త్ క్లినిక్ నూతన భవనాన్ని రూ.18 లక్షలతో నిర్మించారు. ప్రతినెలా క్రమం తప్పకుండా పీహెచ్సీ వైద్యులు 104 వాహనం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సొంత భవనం ప్రారంభానికి నోచుకోకపోవడంతో గ్రామంలోని రచ్చబండ వద్ద చెట్ల కింద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం చొరవ తీసుకుని నూతన భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరారు.