జనగాం: జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబి సందర్భంగా ముస్లింల ర్యాలీ
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ముస్లింలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని గిర్నిగడ్డలోని లేబర్ గడ్డ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పోస్ట్ ఆఫీస్,నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్, అమ్మబావి, గుండ్లగడ్డ,ధర్మకంచ,అంబేద్కర్ నగర్,ఆర్టీసీ చౌరస్తా మీదుగా స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని జామియా మసీదు వరకు ఈ ర్యాలీ కొనసాగింది.ఈ ర్యాలీలో ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.