తలుపుల మండలంలోని గజ్జలవారిపల్లి లో కొండచిలువ కలకలం
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం తలుపుల మండలంలోని గజ్జల వారి పల్లిలో గల పంట పొలాల్లో కొండచిలువ కలకలం సృష్టించింది. బుధవారం వేరుశెనగ పంట పొలంలో కూలీలు రైతులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా కొండచిలువ కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని కొండ చిలువను పట్టుకున్నారు. ఇలాంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.