ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని బీసీ పల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో నిర్వహించిన ఎంఎస్సీ ఎంఈ పార్క్ లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటుగా జిల్లా అధికారులు కీలకపాత్ర పోషించారు ముఖ్యమంత్రి కి హెలిపాడ్ నుండి సభ వేదిక వరకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పుష్పగుచ్చని అందజేసి దుశాల్వాతో ముఖ్యమంత్రిని సత్కరించారు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఇతర జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు ప్రకాశం బాపట్ల నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు