అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే నిఖిత మృతదేహం హైదరాబాద్ కు శుక్రవారం తీసుకొచ్చారు. హత్య చేసిన నిందితుడు అర్జున్ ఇండియాకు తిరిగి రాగా.. డిసెంబర్ 31న అపార్ట్మెంట్కి వెళ్లి అదే రోజు నిఖితను కత్తితో పొడిచి చంపినట్లు అనుమానిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే నిఖితను హత్య చేసినట్లు తెలుస్తోంది.