మంత్రాలయం: అసెంబ్లీ సమావేశాల్లో ఆదోని జిల్లాగా ఏర్పాటు కోసం జిల్లాల్లోని ఎమ్మెల్యేలందరూ తమ గళం వినిపించాలి: ఎమ్మార్పీఎస్
పెద్ద కడబూరు:ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆదోని జిల్లాగా ఏర్పాటు కోసం జిల్లాల్లోని ఎమ్మెల్యేలందరూ తమ గళం వినిపించాలని ఎమ్మార్పీఎస్ పెద్ద కడబూరు మండల అద్యక్షుడు యువరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పరిశ్రమలు, వైద్య సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడ్డారు.