గద్వాల్: ప్రజా పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన విద్యార్థులు
బుధవారం ఉదయం గద్వాల కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పాటకు వారు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గౌరమ్మ, బతుకమ్మల విశిష్టతను పాటలో వివరిస్తూ విద్యార్థినులు నృత్యం చేశారు. వారి ప్రతిభను అధికారులు ప్రశంసించారు.