కుప్పం: పంటకు కాపలాగా ఉండి ప్రాణాలు వదిలిన రైతు #viral
అడవి పందుల నుండి రాగి పంటను కాపాడుకునేందుకు పంటకు కాపలాగా ఉన్న రైతు కిట్టప్ప పై ఒంటరి ఏనుగు దాడి చేసి హతమార్చింది. అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో కిట్టప్ప పొలంలోకి వచ్చిన ఏనుగు పొలంలోని గుడిసెను ధ్వంసం చేసి అందులోని కిట్టప్పను తొక్కి చంపింది. అడవి పందుల నుండి పంటను కాపాడుకునేందుకు కాపలాగా ఉన్న రైతు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.