యర్రగొండపాలెం: దోర్నాల పట్టణంలో ప్రారంభానికి నోచుకోక శిధిలమైపోయిన షాదిఖానా
ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో మైనార్టీల ప్రయోజనార్థం నిర్మించిన షాదిఖానా ప్రారంభించకుండానే శిథిలమైపోయింది. ఈ ప్రాంతంలో ముస్లింలు అధికంగా నివసించడంతో వారికి తోడ్పాటు అందించే క్రమంలో శుభకార్యాలు జరుపుకునేందుకు 1996లో అప్పటి టిడిపి ప్రభుత్వం 7 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించేందుకు ప్రారంభించారు. అయితే ఊరికి దూరంగా ఉందని పలు కారణాలతో కొందరు వ్యతిరేకించడంతో ప్రారంభానికి నోచుకోక శిథిలమైపోయిందని గ్రామస్తులు తెలిపారు.