సంగారెడ్డి: రేపు సంగారెడ్డిలో తెలంగాణ సాయుధ పోరాట సభ, హాజరుకానున్న సిపిఎం పొలిటికల్ బూరుగ సభ్యులు బివి రాఘవులు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో బుధవారం జరిగే తెలంగాణ సాయుధ పోరాట సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ కోరారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అత్యధిక గృహం నుంచి కోటిపల్లి చౌరస్తా వరకు బైక్ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. సభకు పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.