మంచిర్యాల: మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ మీేరకు ఆదివారం మధ్యాహ్నం సమీకృత కలెక్టరేట్లో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపల్ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.