శామీర్పేట: మహమ్మద్ ప్రవక్త బోధనలు పాటించాలని నినాదాలు చేస్తూ ముస్లిం సోదరులు ర్యాలీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలలో భాగంగా మూసాపేట్ లో ముస్లిం సోదరులు జండాలను చేతపట్టి వేడుకలను నిర్వహించారు.. మూసాపేట్ నుంచి కూకట్పల్లి వరకు ర్యాలీ కొనసాగింది. ఆదివారం మొహమ్మద్ ప్రవక్త బోధనలు పాటించాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ర్యాలీ జరిగే ప్రాంతాలలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలను చేపట్టారు.