తుఫాను కారణంగా మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: DSP శ్రీనివాసరావు తుఫాను కారణంగా మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. లోతట్టు గ్రామాలను పోలీసు బృందాలతో కలిసి ఆయన పరిశీలించారు. DSP మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం లోతట్టు ప్రాంతాల్లో పోలీసు పహారా ముమ్మరం చేసినట్టు తెలిపారు. కల్వర్టులు, వాగులు, వంకల వద్ద వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.