నగరంలోని మెడికల్ కళాశాలను సందర్శించిన వైసీపీ నేతలు
Eluru Urban, Eluru | Sep 15, 2025
సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు లోని పాత బస్టాండ్ వద్ద గల మెడికల్ కళాశాలను దెందులూరు మాజీ శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి, వైఎస్ఆర్సిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయి కళాశాలను ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మెడికల్ కాలేజ్ ని సందర్శించి, కేక్ కట్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలో ఇప్పటివరకు రెండు నూతన బ్యాచులు ప్రారంభమయ్యాయని అన్నారు.