సెట్ విచారణ అనంతరం భూమన వ్యాఖ్యలను టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు పరకామణి కేసులో రవికుమార్ చేసిన చోరీని గిఫ్ట్ గా మార్చి దొంగను దాతగా చూపినప్పుడు ఎందుకు సంతకాలు పెట్టారంటూ ప్రశ్నించారు దీని వెనుక వైసిపి నేతల హస్తము ఉన్నట్లు ఆరోపించారు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తొలగించారో క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు ప్రశ్నించారు ఇదంతా భూమన హయాంలోనే జరిగిందని పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.