ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అటవీ శాఖ పరిధిలోని నెక్కంటి ప్రాంతంలో పది రోజుల కిందట పెద్దపులి దాడిలో ఆవు మృత్యువాత పడింది. ఆవు యజమాని పాలుట్ల గ్రామానికి చెందిన బస్సే నాయకు కు రేంజ్ అధికారి హరి గంజివారిపల్లి కార్యాలయంలో 28 వేల చెక్కు నందు చేశారు. డిఆర్ఓ రామ్ నాయక్ ఎఫ్ బి ఓ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.