కళ్యాణదుర్గం: గుద్దెళ్ళ గ్రామంలో మందు కొట్టిన గడ్డిని తిని మూడు ఆవులు మృతి, విచారణ చేపట్టిన పశువైద్యాధికారులు
కంబదూరు మండలం గుద్దెళ్ళ గ్రామంలో గంగప్ప అనే రైతుకు చెందిన మూడు ఆవులు మందు కొట్టిన గడ్డిని తిని మృతి చెందాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గంగప్ప ఆవులను గ్రామ శివారులో వదిలాడు. అయితే ఆవులు మందు కొట్టిన గడ్డిని తిని సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాయి. సుమారు రెండు లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు గంగప్ప వాపోయాడు. ఈ ఘటనపై పశువైద్యాధికారులు విచారణ చేపట్టారు.