భూపాలపల్లి: పేద నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుంది భూపాలపల్లి ఎమ్మెల్యే
ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద, నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఆదివారం భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 69 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.16,50,000/- విలువైన చెక్కులను మొగుళ్ళపల్లి రైతు వేదికలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు, ఖరీదైన వైద్యం చేయించుకోలేని