కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో భగవద్గీత పై భక్తుల అవగాహన కల్పించారు. అల్విన్ కాలనీ పటేల్ కుంట పార్కులో శ్రీకృష్ణుడు భక్తులు హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ అంటూ కీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ వాకింగ్ చేసే వారికి భగవద్గీతపై అవగాహన కల్పించారు. అందరూ భగవద్గీతను పాటించాలని తద్వారా దైవభక్తి అలవాడి హిందూ సంస్కృతి, సంప్రదాయాలు అలవర్చుకొని సనాతన ధర్మాన్ని పరిరక్షించిన వారవుతారనన్నారు.