నిడమానూరు: నల్లగొండ జిల్లాలో బతుకమ్మ విషయంలో అపోహలు వద్దని పురోహితులు వెల్లడి
నల్లగొండ జిల్లా: బతుకమ్మ దసరా పండగలపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని వైదిక ఆగమ పురోహితుడు శివాజీ వర్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నల్లగొండ జిల్లా నిడదనూరులో ఆయన మాట్లాడుతూ ఈనెల 21న ఎంగిలిపువ్వు బతుకమ్మ 22న దేవీ నవరాత్రి ఉత్సవాలు 29న సద్దుల బతుకమ్మ ప్రారంభం అవుతాయన్నారు. అక్టోబర్ 2న దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు .అక్టోబర్ 3న అమ్మవారి నిమజ్జనం చేయాలని తెలిపారు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు.