అసిఫాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి:TAGS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని TAGS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.