భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి పడిపూజ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఆలయంలో సోమవారం రాత్రి అయ్యప్పస్వామి మాల దారులు వైభవంగా అయ్యప్పస్వామి పడి పూజలు నిర్వహించారు. అయ్యప్పస్వామి పాటలు పాడుతూ ఎంతో వైభవంగా పూజలు నిర్వహించారు.మొగిలి గ్రామానికి చెందిన రాజేష్,విష్ణు, లిఖిత్,సతీష్,ధనుష్, హరి, ఆధ్వర్యంలో మహా పడిపూజ చేపట్టారు.ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వాములు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.