కోయిల్ కొండ: కోయిలకొండ మండలంలో వరి పంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కోయిల్ కొండ మండలం శేరి వెంకటా పూర్ గ్రామం లో శ్రీధర్ రెడ్డి, సంగనోని పల్లి గ్రామం లో టి.నరేందర్ రెడ్డి అనే రైతులకు చెందిన వరి పైర్లు భూగర్భ జలాలు ఇంకి పోయి బోరు లో నీరు సరిపడినంత లేక పాక్షికంగా విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించిన కలెక్టర్, అందుకు గల కారణాల గురించి వ్యవసాయ అధికార