అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయాల తరలింపు ప్రారంభం
ఇటీవల కూలిపోయిన ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి వివిధ విభాగాలను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.ఇందులో భాగంగా అర్బన్ తహశీల్దార్ కార్యాలయానికి జడ్పీ కార్యాలయంలో ఉపయోగించని నాలుగు గదులను కేటాయించారు. ఇప్పటికే కార్యాలయ రికార్డులను తరలించారు. ఈ తరలింపులో భాగంగా చేపట్టిన మరమ్మతు పనులను జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.