పీలేరు సర్పంచ్ షేక్ హబీబ్ భాషా ఆహ్వానం మేరకు సెమినార్ కు హాజరై విలువైన సందేశాన్ని అందించించిన ప్రముఖ సినీనటుడు అలీ
పీలేరు సర్పంచ్ షేక్ హబీబ్ భాషా ఆహ్వానం మేరకు సెమినార్ కు ప్రముఖ సినీనటుడు,కమెడియన్ అలీ ఆదివారం హాజరయ్యారు.హైదరాబాద్ మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఆదివారం సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ బెదిరింపులపై సెమినార్ నిర్వహించారు.పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాషా ఆహ్వానం మేరకు సినీ నటుడు అలీ సెమినార్ కు హాజరై తన విలువైన సందేశాన్ని సెమినార్ లో అందించారు.సైబర్ నేరాల పై భద్రత, డ్రగ్స్ నివారణ పై అవగాహన పెంచేందుకు ఈ సెమినార్ చాలా ఉపయోగకరమని ఎస్పీ మధుకర్ స్వామి, మరియు సెమినార్ ట్రైనర్ ప్రమీల్ అర్జున్ తెలిపారు.సెమినార్ కు హాజరైన అలీని,డాక్టర్ షేక్ హబీబ్ భాషా ను ఘనంగా సన్మానించారు