మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ జీఎస్టీ 2.0 సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం
Machilipatnam South, Krishna | Sep 26, 2025
మచిలీపట్నంలో శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ జీఎస్టీ 2.0 సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పన్ను తగ్గింపులు, వ్యాపారులకు కలిగే లాభాలు ఇంటింటికి చేరేలా చూడాలని ఆదేశించారు. మచిలీపట్నంలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు రూపకల్పన చేయాలని సూచించారు.